ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని బొమ్మ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో గురువారం ప్రముఖ స్పైడర్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ లో బిటెక్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. నాలుగు దఫాలుగా జరిగిన ఇంటర్వ్యూలో టాలెంట్ చూపి 11 మంది ప్లేస్ మెంట్ సాధించినట్లు బొమ్మ విద్యాసంస్థల చైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆఫర్ లెటర్లను స్టూడెంట్స్ కు చైర్మన్ అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది కూడా తమ కాలేజ్ స్టూడెంట్స్ 157 మంది ప్రముఖ కంపెనీల్లో ప్లేస్ మెంట్ సాధించినట్లు గుర్తు చేశారు. వైస్ చైర్మన్ బొమ్మ సత్య ప్రసాద్ ప్లేస్ మెంట్ సాధించిన స్టూడెంట్స్ కు, పేరెంట్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఉదారు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
