హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్‌లో అంతర్జాతీయ ఉత్తమ విధానాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల విదేశీ స్టడీ టూర్‌లో భాగంగా సింగపూర్ రెండో బ్యాచ్ ఆఫీసర్ల లిస్టును స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ రిలీజ్ చేసింది. టీచర్లు, విద్యాశాఖ అధికారులతో కూడిన మొత్తం 40 మంది ప్రతినిధుల బృందాన్ని పంపాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటికే 29 మంది టీచర్ల పేర్లను రిలీజ్ చేసింది.
తాజాగా.. 10 మంది ఆఫీసర్ల పేర్లనూ ప్రకటించింది. ఈ టీమ్‌లో ఇంటర్ బోర్డు సెక్రెటరీ అభిలాష అభినవ్, సమగ్ర శిక్ష జేడీ మదన్ మోహన్, హైదరాబాద్ డీఈవో యాదయ్య, మహబూబ్ నగర్ డీఈవో విజయకుమారితోపాటు పీ రామస్వామి(సిద్దిపేట సమగ్ర శిక్ష కోఆర్డినేటర్), పీ బలరాం( దేవరకద్ర ఎంఈవో), శంకర్ ( రాజేంద్రనగర్ ఎంఈవో), ఎన్. కల్యాణి (ఏఎస్పీడీ ఆఫీస్ ఏఎంవో), జె. శ్రీనివాసులు( ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ), సంపత్ కుమార్ (నర్సంపేట జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్) తదితరులున్నారు. కాగా, మరో ఆఫీసర్ పేరు ఖరారు కాలేదు. ఈ టీమ్ అంతా సెప్టెంబర్ 19 నుంచి 26 వరకూ సింగపూర్ పర్యటనలో పాల్గొంటారు.
