బీసీ, ఈబీసీ స్టూడెంట్లకు సువర్ణావకాశం..సెప్టెంబర్ 1 నుంచి ఫూలే ఓవర్సీస్ అప్లికేషన్లు షురూ

బీసీ, ఈబీసీ స్టూడెంట్లకు సువర్ణావకాశం..సెప్టెంబర్ 1 నుంచి ఫూలే ఓవర్సీస్ అప్లికేషన్లు షురూ
  •     350 మందికి అవకాశం.. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. వచ్చే నెల 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ వెల్ఫేర్ కమిషనర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ విడతలో 350 మందిని ఎంపిక చేయనుండగా.. 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారని వెల్లడించారు. 

విదేశాల్లో పీజీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ తదితర ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న లేదా చదవాలనుకునే అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు, ఇతర వివరాల కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ http://www.telanganaepass.cgg.gov.in చూడాలని కమిషనర్ సూచించారు. 

అర్హతలు..

  •     కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.5 లక్షల లోపు ఉండాలి.
  •     దరఖాస్తు చేసే నాటికి వయస్సు 35 ఏండ్లకు మించకూడదు.
  •     గ్రాడ్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
  •     జీఆర్ ఈ -260 లేదా జీ మ్యాట్  -500 స్కోర్ కలిగి ఉండాలి.
  •     తోఫెల్  పరీక్షలో -60 మార్కులు లేదా ఐఈఎల్ టీ ఎస్  -6.0 లేదా పీటీఈ  -50 మార్కులు స్కోర్ ఏదైనా కలిగి ఉండాలి.