హైదరాబాద్, వెలుగు: పదో తరగతి మార్చి- పబ్లిక్ పరీక్షలతోపాటు, జూన్‌లో నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల పాస్ సర్టిఫికెట్లు (మెమోలు) శనివారం నుంచి స్కూళ్లకు చేరనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.లింగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
టెన్త్ లో పాసైన విద్యార్థులు తమ ఒరిజినల్ ఎస్సెస్సీ సర్టిఫికెట్లను ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్ల నుంచి తీసుకోవాలని సూచించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు ఈ మెమోలు అందనున్నాయి.
