టిబెట్‌‌లో వరదలు..  ఐదుగురు మృతి, 558 మంది గల్లంతు

టిబెట్‌‌లో వరదలు..  ఐదుగురు మృతి, 558 మంది గల్లంతు

బీజింగ్‌‌: టిబెట్‌‌లో వచ్చిన ఆకస్మిక వరదలు గ్యిరాంగ్‌‌ కౌంటీలోని పోర్టు ప్రాంతాన్ని ముంచెత్తడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చైనా తెలిపింది. మరో 558 మంది గల్లంతయ్యారని పేర్కొంది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులు ఉన్నట్లు చైనా తెలిపింది. నేపాల్‌‌లో సంభవించిన భారీ వరదలకు ఎత్తైన ప్రాంతంలోని గ్లేసియర్‌‌ కూలిపోవడమే కారణమై ఉండొచ్చని చైనా తెలిపింది. చైనా, నేపాల్‌‌ నిపుణులు, అధికారిక సంస్థలు చేసిన ప్రాథమిక అంచనాల్లో ఈ విషయం వెల్లడైనట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌‌ జియాన్‌‌ తెలిపారు.

 ఎత్తైన ప్రాంతం నుంచి మంచు, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం లెండే నదికి అడ్డుకట్టలాగా మారింది. అనంతరం ఆ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో భారీస్థాయిలో నీరు దిగువకు వచ్చి భోటేకోషి, త్రిశూలి నదీ వ్యవస్థలను ముంచెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో నేపాల్‌‌లో వందలాది మంది మృతిచెందగా.. రహదారులు, వంతెనలు, విద్యుత్‌‌ ప్రాజెక్టులు, నివాస ప్రాంతాలు దెబ్బతిన్నాయి.