- 18న వన మహోత్సవాన్ని సీఎం ప్రారంభిస్తరు
- పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్మధుయాష్కి గౌడ్
మీర్పేట్, వెలుగు: బీఎన్ రెడ్డి నగర్ వాసులకు కేబీఆర్ పార్క్‌లాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్క్ఏర్పాటు కాబోతుందని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తెలిపారు. ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు బీఎన్ రెడ్డి నగర్ ను ఆనుకొని ఉన్న ఫారెస్ట్‌లో వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. ఏర్పాట్లను సోమవారం చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్గీస్, డీఎఫ్‌వో రోహిత్ రెడ్డి, ఏసీపీ కాశీరెడ్డితో కలిసి పరిశీలించారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల కోసం ప్రభుత్వం 30 ఏండ్లుగా ఉన్న 116 ఎకరాల స్థల వివాదాన్ని పరిష్కరించిందని, అందులో పార్క్‌ను ఏర్పాటు చేయనుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.
50 ఎకరాలను జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఇవ్వాలి
బీఎన్ రెడ్డి నగర్ లోని 116 ఎకరాల్లో 50 ఎకరాలను జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.
