45 రోజుల్లో 12 కోట్ల మంది ఫ్రీ బస్ జర్నీ

45 రోజుల్లో 12 కోట్ల మంది ఫ్రీ బస్ జర్నీ

మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు  తెలంగాణ ఆర్టీసీ ఎండీ(RTC MD )తలసజ్జనర్. 45 రోజుల్లో 12 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారన్నారు. త్వరలో 2 వేల 375 కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. వికలాంగులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సజ్జనర్ హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

సగటున ప్రతి రోజు 27లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారని తెలిపారు సజ్జనార్. ఎన్నికల మేనిఫెస్టోలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత జర్నీ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా అధికారంలో వచ్చిన  48 గంటల్లో డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ స్కీమ్ ను ప్రారంభించింది. స్కీమ్ మొదలైన తరువాత ఆర్టీసీలో అక్యుపెన్సీ రేషియో 69 నుంచి 85 శాతంకు పెరిగింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 100 శాతం పైగా ఆక్యుపెన్సీ నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు.