గండిపేట, వెలుగు : మణికొండ మున్సిపాలిటీలోని తిరుమలహిల్స్ కాలనీ రోడ్ నంబర్4లో మంగళవారం ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. స్థానికులు దానిని చూసి భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ స్నేహ అక్కడికి చేరుకుని, 12 అడుగుల కొండ చిలువను పట్టుకున్నాడు.
పామును అటవీశాఖ అధికారులకు అప్పగిస్తామని చెప్పాడు. ఎక్కడైనా పాములు కనిపిస్తే కొట్టి చంపొద్దని సూచించాడు. అటవీ శాఖ, జూపార్కు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరాడు.
