
హైదరాబాద్, వెలుగు: సురవరం ప్రతాప రెడ్డి తెలుగు వర్సిటీ వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన12 మంది ప్రముఖులను 2023 సంవత్సరానికి గానూ ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది. ఎలనాగ (కవిత), డాక్టర్ ప్రభల జానకి (విమర్శ), ఆర్.లక్ష్మీరెడ్డి (చిత్రలేఖనం), సంపత్ రెడ్డి (శిల్పం), పేరిణి రమేష్ లాల్ (నృత్యం), హరిప్రియ (సంగీతం), కాసుల ప్రతాపరెడ్డి (పత్రికా రంగం), గుమ్మడి గోపాలకృష్ణ (నాటకం), కడకంచి పాపయ్య (జానపద కళారంగం), ధూళిపాళ మహాదేవమణి (అవధానం), కె.మలయవాసిని (ఉత్తమ రచయిత్రి), శాంతి నారాయణ (నవల/ కథ) పురస్కారాలకు ఎంపికయ్యారని వర్సిటీ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు తెలిపారు. త్వరలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో జరిగే ప్రత్యేక వేడుకలో ఈ పురస్కారాలను అందించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎంపికైన ఒక్కొక్కరికి రూ.20,116 అందజేసి సత్కరిస్తామని పేర్కొన్నారు.