న్యూఢిల్లీ, వెలుగు: మయన్మార్ నుంచి 12 మంది తెలంగాణ వాసులు భారత్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ భవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్ ఒక ప్రకటన జారీ చేసింది. మయన్మార్ లో సైబర్ నేరాల శిబిరాల్లో అనేక మంది భారతీయులు చిక్కుకున్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇందులో భాగంగానే 270 మందిని భారత వాయుసేనకు చెందిన రెండు విమానాల్లో భారత్ కు తరలించారు. అందులో తెలంగాణకు చెందిన 12 మంది ఉన్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వారిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు చెందిన రెసిడెంట్ కమిషన్లకు శుక్రవారం ఉదయం అప్పగించనుంది.
