
వారఫలాలుః జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం (ఆగస్టు 10 నుంచి 16 వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం.
మేషరాశిః ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ఆర్థిక విషయానికొస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలు.. ఆందోళన కలిగిస్తాయి. వారం చివరిలో కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
వృషభ రాశిః ఈ వారం ఈ రాశి వారికి అనుకూల ఫలితాలుంటాయి. అనుకున్న పనులు అనుకున్నవిధంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి.
మిథున రాశిః ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.ఇతరులతో మాట్టాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరితోను వాదనలు పెట్టుకోవద్దు. అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. కొందరు స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది.
కర్కాటక రాశిః ఈ రాశి వారికి ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.ఎవరితోను ఆవేశంగా మాట్లాడవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయం వృద్ది చెందుతుంది. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది,
సింహరాశిః ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు నమ్మినవారే మిమ్మలను మోసం చేసే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి నిరాశ కలిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడే పరిస్థితులు ఉంటాయి.వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి.
కన్యా రాశిః ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబసభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. వారం మధ్యలో నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉందని పండితులు చెబతున్నారు. వ్యాపారస్తులకు మిశ్రమఫలితాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని జీవితభాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఆందోళన చెందవద్దు.. ఆధ్యాత్మిక చింతనతో గడపండి అంతా మంచే జరుగుతుంది.
తులారాశిః ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు, ఉద్యోగస్తులకు వేతనంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి, పూర్వీకుల ఆస్థి కలసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృశ్చిక రాశిః ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. జీవితభాగస్వామి నిర్ణయం ప్రకారం నడచుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు ఉంటాయి. ఆర్థికవిషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులు గుడ్‌న్యూస్ వింటారు. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది.
ధనస్సురాశిః ఈ రాశి వారు ఈ వారం అనవసరంగా ప్రయాణాలు చేయాల్పి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆఫీసులో మీపని మీరు చేసుకోండి. ఎవరితోను వాదనలు పెట్టుకోవద్దు, ఏదో తెలియని ఆందోళనతో ఉంటారు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి.
మకరరాశిః ఈ రాశి వారు ఈ వారం ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. కెరీర్ పరంగా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కుంభరాశిః ఈ రాశి వారికి వారం మొదట్లో ప్రతికూల ఫలితాలు ఏర్పడినా... క్రమేణ అనుకూలంగా మారతాయి. సంతానం కోసం ఎదురుచూసే వారు గుడ్ న్యూస్ వింటారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడినా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఏవిషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
మీనరాశిః ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి