
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో స్వాధీనం చేసుకున్న 12 వేల కిలోల డ్రగ్స్ ను ధ్వంసం చేయనున్నారు. బుధవారం గుజరాత్ లో మాదక ద్రవ్యాల రవాణ, జాతీయ భద్రతపై జరిగే సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇతరులు హాజరు కానున్నారు. రూ. 632.68 కోట్ల విలువైన 12, 438.96 కిలోల డ్రగ్స్ ను ధ్వంసం చేస్తారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) 75 రోజుల్లో కనీసం 75,000 కిలోల జప్తు చేసిన డ్రగ్స్‌ను నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జూలై 30న చండీగఢ్‌లో 31,000 కిలోలకు పైగా డ్రగ్స్‌ను షా నాశనం చేసి ద్వారా మిషన్‌ను ప్రారంభించారు. రెండు వారాల క్రితం షా సమక్షంలో గౌహతిలో 40,000 కిలోల డ్రగ్స్, నార్కోటిక్ పదార్థాలు ధ్వంసం చేశారు. కేవలం 60 రోజుల్లోనే లక్ష్యాన్ని సాధించారు. ఇప్పటి వరకు లక్ష కేజీలకు పైగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసినట్లు సమాచారం.