
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం అర్ధరాత్రి వరకు 1,21,905 గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎల్బీనగర్ జోన్ లో 14,206, చార్మినార్ 6,254, ఖైరతాబాద్ జోన్ లో 11,685, శేరిలింగంపల్లి 21,160, కూకట్ పల్లి 41,815, సికింద్రాబాద్ 8955 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు చెప్పారు. గ్రేటర్ లో 20 ప్రధాన చెరువులతో పాటు 27 పర్మినెంట్ బేబీ పాండ్స్, 24 టెంపరరీ పాండ్స్, 23 ఎక్సావేషన్ పాండ్స్ వద్ద నిమజ్జనం కొనసాగుతోంది.