హైదరాబాద్: గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ (జీఐఏ) ఆధ్వర్యంలో 12వ గోల్ఫ్, టర్ఫ్ సమ్మిట్, ఎక్స్‌పో హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కంట్రీ క్లబ్ లో గురువారం మొదలైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని రిటైర్డ్ ఐఎఫ్ఎస్, కజకిస్థాన్ మాజీ రాయబారి డాక్టర్ టి. వి. నాగేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.
ఎక్స్ పోలో టోరో, క్లబ్ కార్ వంటి 26 ప్రముఖ సంస్థలు గోల్ఫ్, టర్ఫ్ నిర్వహణకు చెందిన ఆధునిక సాంకేతికతలను ప్రదర్శించాయి. అనంతరం జరిగిన సదస్సులో గోల్ఫ్ టూరిజం, టర్ఫ్ నిర్వహణలో సుస్థిరత వంటి అంశాలపై ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) సీఈఓ అమన్‌దీప్ జోల్, గారెత్ నైట్, పాల్ రీవ్స్ వంటి అంతర్జాతీయ నిపుణులు ప్రసంగించారు.
