హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిగో సంస్థ ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల కోసం ఎలక్ట్రిక్ బస్సు లీజింగ్ సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థతో 50 ఈ–బస్సుల పంపిణీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా పది ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ లో మంగళవారం అందజేసింది. గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ ఈ–బస్సులు, ట్రక్కుల కోసం జియల్ మొబిలిటీ అనే ప్లాట్ ఫామ్ ను కూడా ప్రారంభించింది. బస్సుల చార్జింగ్ మౌలిక సదుపాయాలు, నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకుంటుంది. 2027 నాటికి 200 ఈ–బస్సులు, 150 ఈ–ట్రక్కులను ప్రవేశపెట్టాలన్నది ఈ సంస్థల లక్ష్యం.
