బేల మండలంలోని కాంగ్రెస్ లో చేరిన ఇండిపెండెంట్ స‌‌‌‌‌‌‌‌ర్పంచ్

బేల మండలంలోని కాంగ్రెస్ లో చేరిన  ఇండిపెండెంట్ స‌‌‌‌‌‌‌‌ర్పంచ్

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: బేల మండలంలోని కొబ్బయి గ్రామంలో ఇండిపెండెంట్​గా గెలిచిన సర్పంచ్​టేకం సత్యపాల్ మంగళవారం కాంగ్రెస్​లో చేరారు. ఆయనకు కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్​ఆఫీస్​లో పార్టీ సీనియర్​నాయకులు వైద్య నానాజీ పాటిల్, గిమ్మ సంతోష్​రావు కండువా కప్పి ఆహ్వానించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆకర్షితుడై ఆయన పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయ‌‌‌‌‌‌‌‌కులు లోక ప్రవీణ్ రెడ్డి, ఆశన్న, కొండూరి రవి, మాడ‌‌‌‌‌‌‌‌వి జనార్ధన్, ఖయ్యూం, ప్రమోద్, వికాస్, ప్రశాంత్ త‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌రులు పాల్గొన్నారు.