నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో బీజేపీ ఆఫీస్‌ను ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా క్యాడర్ ముందుకు సాగాలన్నారు. అనంతరం నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, గూడూరు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
