క్రీడా పోటీల్లో తొక్కిసలాట.. 13 మంది మృతి

క్రీడా పోటీల్లో తొక్కిసలాట.. 13 మంది మృతి

మడగాస్కర్​లో నిర్వహించిన క్రీడా పోటీల్లో తొక్కసలాట జరిగి 13 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వీప దేశమైన మడగాస్కర్​రాజధాని అంటాననారివోలో 11వ ఇండియన్​ ఓషియన్​స్పోర్ట్స్​పోటీలు ప్రారంభించారు. 

ఈ ఈవెంట్​కు సుమారు 50 వేల మంది క్రీడాభిమానులు అటెండ్​ అయ్యారు. జనాలు గుమి గూడటంతో స్టేడియం వద్ద తొక్కసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడి చాలా మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు అప్రమత్తమై  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

మడగాస్కర్​ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. ఒకరినొకరు తోసుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. నైరుతి హిందూ మహాసముద్ర దీవుల్లో ప్రతి నాలుగేళ్లకొకసారి ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని, ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలి సారని.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.