నీటి లోపల మ్యాజిక్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కెక్కిన 13ఏళ్ల చిన్నారి

నీటి లోపల మ్యాజిక్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కెక్కిన 13ఏళ్ల చిన్నారి

యూఎస్‌కి చెందిన 13 ఏళ్ల స్కూబా డైవర్ అవరీ ఎమర్సన్ ఫిషర్ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించింది. నీటి అడుగున కేవలం మూడు నిమిషాల్లోనే అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్‌లు ప్రదర్శించి ఓ కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. అవరీ నీటి అడుగున మ్యాజిక్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ, అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన దానికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది.

స్కూబా డైవింగ్ గేర్‌ని ధరించి, అవేరీ మంత్రముగ్ధులను చేసే మ్యాజిక్ ట్రిక్‌లను అమలు చేసింది. ఇది ప్రజలను ఆశ్చర్యపరిచింది. "నీటి అడుగున మాయాజాలం చేసిన 13 ఏళ్ల స్కూబా డైవర్ అవరీ ఎమర్సన్ ఫిషర్ (USA)కి అభినందనలు" అనే క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ అయింది. లాక్ డౌన్ సమయంలో అక్వేరియంల పట్ల ఆమెకున్న ఇంట్రస్ట్ తో స్కూబా డైవింగ్, నీటి అడుగున మాయాజాలంలో చేయడంతో అవేరి ప్రయాణం ప్రారంభమైంది.

క్వారంటైన్‌లో ఎలా గడిపారు అని అడగ్గా.. స్కూబా డైవింగ్ నేర్చుకోవాలనే కోరికను ఆమె వ్యక్తం చేసింది. సవాళ్లను అధిగమించి, ఆమె ఆన్‌లైన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది. వేసవిలో ఆమె ఓపెన్ వాటర్ డైవర్ సర్టిఫికేట్‌ను సంపాదించింది. తదనంతరం శిక్షణ, 30కి పైగా ఓషన్ డైవ్‌ల ద్వారా మరో 12 సర్టిఫికేట్‌లను పొందిందని GWR బ్లాగ్ తెలిపింది.