డయాబెటిస్ టెంపుల్: ఈ దేవాలయంలో స్వామిని దర్శిస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది..!

డయాబెటిస్ టెంపుల్:  ఈ దేవాలయంలో స్వామిని దర్శిస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది..!

షుగర్​ వ్యాధి వచ్చిందంటే చాలు .. జనాలు డాక్టర్ల దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకొని మందులు వాడుతారు. ఒకసారి ఈ వ్యాధి వచ్చిందంటే.. జీవితాంతం  మందు గోళీలు మింగాల్సిందేనని వైద్యులుచెబుతారు.  కాని తమిళనాడులోని ఓ దేవాలయానికి వెళితే షుగర్ వ్యాధి తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.  ఆ దేవాలయం విశిష్టత ఏంటి.. .. అక్కడ ఏ దేవుడు ఉన్నాడు. .. ఎక్కడ ఉంది .. ఎలా వెళ్లాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  .!

తమిళనాడులో 1300 సంవత్సరాల  పురాతన దేవాలయం ఉంది.  ఈ దేవాలయం డయాబెటిస్​ ఆలయంగా ప్రసిద్ది చెందింది.   తిరువారూర్ జిల్లాలోని కోయిల్వెన్ని లో అతి పురాతన దేవాలయం ఉంది. 

 కరుంబేశ్వరర్ ఆలయంలో పరమేశ్వరుడి కొలువై ఉన్నాడు.  ఈ  దేవాలయంలోని శివయ్య  మధుమేహాన్ని నయం చేయడంలో ప్రసిద్ధి చెందాడని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వలన  డయాబెటిస్ వ్యాధి నుంచి  విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. 

 పరమేశ్వరుడు .. కరుంబేశ్వరర్‌..  (చెరకు దేవుడు) రూపంలో కొలువై ఉంటాడు... ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న వ్యాధుల్లో మధుమేహం  ఒకటి.  ఇక్కడ శివయ్య డయాబెటిస్  వ్యాధిని నయం చేస్తాడని  భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఇక్కడ జరిగే ఒక సాధారణ, విచిత్రమైన ఆచారం ద్వారా వేలాది మంది భక్తులు షుగర్​ వ్యాధి  తగ్గుతుందని  నమ్ముతున్నారు. 

ఇక్కడ శివుడిని కరుంబేశ్వరర్‌ రూపంలో పూజిస్తారు. కరుంబేశ్వరర్‌  అంటే తమిళంలో  చెరకుకు ప్రభువు..  అని అర్థం. చక్కెర సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఉపశమనం పొందుతారని చెబుతారు. ఈ స్థలం గొప్ప ఆధ్యాత్మిక .. సానుకూల శక్తికి ప్రసిద్ధి చెందిందని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.

ఇక్కడ  దర్శనమిచ్చే శివలింగం  చాలా భిన్నంగా ఉంటుంది. స్థానికులు దీనిని కరుంబేశ్వరర్ లింగం అని పిలుస్తారు. ఇది చెరకు కాండాల సమూహాన్ని కలిపి కట్ట  కట్టినట్లుగా కనిపిస్తుంది. మరో ముఖ్యమైన ఆచారం ఈ దేవాలయంలో ఉంది.  ఇక్కడ చీమలకు..  చిన్న కీటకాలకు ప్రసాదం పెడతారు. ఇక్కడ భక్తులు చక్కెరను  చీమల గుంపునకు సమర్పిస్తారు.  అలా చీమలు పంచదారను తింటుంటే  చక్కెర వ్యాధి తగ్గిందని  నమ్ముతారు. పదే పదే  ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత   బ్లడ్ షుగర్ లెవల్స్​  తగ్గుతాయని  భక్తులు చెబుతున్నారు.

ఎలా వెళ్లాలంటే..!

  • రోడ్డు మార్గం  ద్వారా వెళ్లాలనుకుంటే..
  •  కరుంబేశ్వరర్ ఆలయం మన్నార్​ గుడి నుంచి 14 కి.మీల దూరంలో ఉంది
  • తిరువారూర్ కు  28 కి.మీ దూరంలో ఉంది. 
  • తంజావూరుకు 55 కి.మీ దూరంలో  ఉంది. 

మన్నార్​ గుడి, తిరువారూర్, తంజావూరు, కుంభకోణం ,  నాగపట్నం నుంచి తమిళనాడు రాష్ట్ర బస్సులు , ప్రైవేట్ మినీ బస్సులు నడుస్తాయి. చెన్నై లేదా బెంగళూరు నుంచి  తంజావూరు ... మన్నార్​ గుడి ...  కోయిల్వెన్ని మీదుగా  ఈ ఆలయానికి చేరుకోవచ్చు. 

రైలు మార్గం:కుంభకోణం రైల్వేస్టేషన్​ నుంచి ఈ  ఆలయం 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.  టాక్సీలు,  పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా అమ్మాపేటై అనే గ్రామానికి వెళ్లాలి.  అక్కడి నుంచి 4 కి.మీ దూరంలో ఆలయం ఉంది.
 మన్నార్​ గుడి రైల్వే స్టేషన్ (MQ) అతి దగ్గరి రైల్వే స్టేషన్.  ఇక్కడి నుంచి ఈ ఆలయం 15 కిలోమీటర్లు ఉంటుంది. 

విమాన మార్గం :  తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం (TRZ) నుంచి 100 కి.మీ దూరంలో ఉంది. అక్కడి నుంచి  టాక్సీలు ,  బస్సులు ఉంటాయి. స్థానిక ఆటోలు మరియు టాక్సీలు సులభంగా అందుబాటులో ఉన్నాయి.


Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  స్థల పురాణం నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పండితుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆరోగ్య సమస్యలకు వైద్య  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.