అందరికీ పని కలిపించడానికి ఏడాదికి 13.52 లక్షల కోట్లు కావాలె

అందరికీ పని కలిపించడానికి ఏడాదికి 13.52 లక్షల కోట్లు కావాలె

న్యూఢిల్లీ: దేశంలోని 21.8 కోట్ల మందికి  ఒక ఏడాది పాటు పని కలిపించడానికి  ప్రభుత్వం కనీసం రూ.13.52 లక్షల కోట్లు (జీడీపీలో 5 శాతం) ఖర్చు చేయాలని, ‘పని హక్కు’ అనే చట్టాన్ని తీసుకు రావాల్సి ఉంటుందని పీపుల్స్ కమిషన్ ఆన్ ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ అండ్ అన్‌‌‌‌ఎంప్లాయ్‌‌‌‌మెంట్ విడుదల చేసిన స్టడీ ఒకటి వెల్లడించింది. దేశ్‌‌‌‌ బచావో అభియాన్ ఏర్పాటు చేసి ఈ సంస్థ, ‘పనిచేసే హక్కు’ కింద ఓ రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేసింది.  అందరికీ  ఎంప్లాయ్‌‌‌‌మెంట్ ఇవ్వాలంటే లీగల్‌‌‌‌గా, సోషల్‌‌‌‌గా, ఎకనామిక్‌‌‌‌ పరంగా వేగంగా మార్పులు రావాల్సి ఉందని తెలిపింది.

దేశంలోని ప్రజలు మెరుగైన జీవితాన్ని పొందాలంటే ‘పని చేసే హక్కు’ చట్టాన్ని తీసుకురావాలని  ప్రభుత్వానికి సలహాయిచ్చింది. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం ఎంజీఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈజీఏ కింద పని పొందుతున్న వారిని మినహాయిస్తే దేశంలోని 21.8 కోట్ల మందికి వెంటనే పని అవసరం. ఎంప్లాయ్‌‌‌‌మెంట్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుందని, అలానే డిమాండ్ కూడా పెరుగుతుందని ప్రభుత్వానికి ఈ సంస్థ సలహాయిచ్చింది.   అందరికి పని కలిపించడానికి మన దగ్గర సరిపడినంత వనరులు లేవన్నది అర్థం లేని వాదన అని దీ పీపుల్స్ కమిషన్ పేర్కొంది.