రాష్ట్రంలో 14 మంది అడిషనల్ కలెక్టర్ల బదిలీ

రాష్ట్రంలో 14 మంది అడిషనల్ కలెక్టర్ల బదిలీ

రాష్ట్రంలో 14 మంది అడిషనల్ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మను వికారాబాద్ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో కుష్బూ గుప్తాను నియమించింది. బీ రాహుల్ను మంచిర్యాల అడిషనల్ కలెక్టర్గా నియమించింది. మయాంక్ మిట్టల్ను నారాయణపేట అడిషనల్ కలెక్టర్ గా నియమించగా.. అక్కడ పనిచేస్తున్న కందూరి చంద్రారెడ్డిని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

 

అశ్విని తానాజీ వాంఖడేను వరంగల్ అడిషనల్ కలెక్టర్ గా బదిలీ చేయగా.. అక్కడ పనిచేస్తున్న హరిసింగ్ను బదిలీ చేసింది. మంద మకరందున జగిత్యాలకు బదిలీ చేయగా.. ఇక్కడ పనిచేస్తున్న జడల అన్సారీని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ప్రపుల్ దేశాయ్ను జనగామకు బదిలీ చేయగా.. అబ్దుల్ హమీద్ను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని చెప్పింది. అభిషేక్ అగస్త్యను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు బదిలీ చేయగా.. ఇక్కడ పనిచేస్తున్న జాన్ శ్యామ్ సన్ ను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అపూర్వ చౌహాన్ను జోగులాంబ గద్వాల అడిషనల్ కలెక్టర్ గా నియమించింది.