GHMC ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వెహికల్ పై 14 పెండింగ్ చలాన్లు

GHMC ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వెహికల్ పై 14 పెండింగ్ చలాన్లు

రూల్స్ పాటించాల్సిన ఐపీఎస్ అధికారి.. వాటిని బేఖాతరు చేశారు. నగరంలో నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే.. జరిమానా వేసే అధికారే ఈయన.. అలాంటి అధికారిపైనే.. 2018 నుంచి చలాన్లు పెండింగులో ఉ న్నాయి. బల్దియాలో అత్యదిక విభాగాలు ఉన్న అధికారి విశ్వజిత్.. ట్రాన్స్ పోర్ట్, లెక్స్, అడ్వటైజ్ మెంట్ విభానికి అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు… ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగానికి డైరెక్టర్ గానూ ఉన్నారు. ఐపీఎస్ అధికారి విశ్వజిత్ అధికారిక వాహనంపై 14 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం 13 వేల 790 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంది. పెండింగ్ చలాన్లలో 11 ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ కాగా..రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసినవి రెండు.. స్టాప్ లైన్ ను క్రాస్ చేసినవి ఒక్కటి. విశ్వజిత్ వాహనమే కాకుండా.. అనేక మంది డిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల అధిపతుల వాహనాలపై చలాన్లు ఉన్నాయి. ఐపీఎస్ అధికారులు జరిమానా కట్టకున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.