డ్రంకెన్ డ్రైవ్​లో 14 మందికి జైలు శిక్ష

డ్రంకెన్ డ్రైవ్​లో 14 మందికి జైలు శిక్ష

అబిడ్స్, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్​లో పట్టుబడ్డ  14 మందికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించినట్లు అబిడ్స్ ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. అబిడ్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 14 మందిని  శుక్రవారం పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరి  కేసు తీవ్రత ఆధారంగా రెండ్రోజుల నుంచి 7 రోజుల వరకు జైలు శిక్ష, రూ. 300 నుంచి 3,300 వరకు ఫైన్ విధించడంతో పాటు వారి లైసెన్స్​ను సస్పెండ్ చేస్తూ నాంపల్లి 8వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చిందని ఇన్​స్పెక్టర్ తెలిపారు.