తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా కేసులు,12మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా కేసులు,12మంది మృతి

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,24,430 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,417 కరోనా కేసులుగా నిర్ధారణయ్యాయి. 12 మంది బాధితులు చనిపోయారు. బులెటిన్‌ విడుదల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,10,834కి చేరిందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,546 మంది కరోనాతో చనిపోయారు. ఒక్కరోజు వ్యవధిలో 1,897 మంది బాధితులు కరోనా నుంచి  కోలుకోగా.. ప్రస్తుతం 19,029 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.