మరోసారి భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

మరోసారి భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

చమురుకంపెనీలు సామాన్యుడికి మళ్లీ షాక్ ఇచ్చాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరతో సిలిండర్ రూ.1052 కు చేరింది. పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన కేంద్రం.. ఇప్పుడు సామాన్యులపై మరోసారి భారం వేసింది. ఏడునెలల కాలంలో ఎల్పీజీ సిలిండర్ పై రూ. 325 పెరిగింది. ఇటీవల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 250 పెంచడంతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ రూ.2460గా ఉంది.