జీహెచ్‌ఎంసీ విస్తరణ అనంతరం 144 మంది ఏఎంసీల బదిలీ

జీహెచ్‌ఎంసీ విస్తరణ అనంతరం 144 మంది ఏఎంసీల బదిలీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీ విస్తరణ అనంతరం ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్​లు వేగంగా జరుగుతున్నాయి. రోజుకో విభాగంలో ట్రాన్స్​ఫర్లు జరుగుతుండగా, బుధవారం కీలకమైన అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల (ఏఎంసీ) బదిలీలు జరిగాయి. ఒక్కసారిగా 144 మంది ఏఎంసీలను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఒక్కో సర్కిల్​కు ఇద్దరు నుంచి నలుగురు ఏఎంసీలను నియమిస్తూ పోస్టింగ్​లు ఇచ్చారు. అలాగే పలువురు ఇంజినీర్ల బదిలీలు జరిగాయి. జోన్ స్థాయిలో సూపరింటెండింగ్ ఇంజినీర్లు (ఎస్‌ఈ), సర్కిల్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు (ఈఈ) బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.