ఉదయ్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు

ఉదయ్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు

ఉదయ్ పూర్ లో జరిగిన హత్య  రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మహ్మద్ ప్రవక్తను అవమానపరిచిన నుపుర్ శర్మను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కన్హయ్య లాల్ అనే దర్జీ (టైలర్)ని పట్టపగలే దారుణంగా హత్యచేశారు. అంతే కాదు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ ఘటన వైరల్ గా మారింది. దీంతో పాటు ప్రధాని మోదీని కూడా హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఇక ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఆ రాష్ట్ర వ్యా్ప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగా అక్కడ ఇంటర్నెట్ సర్వీసులు రద్దు చేశారు. రాజస్థాన్ లోని అన్ని జిల్లాల్లోనూ నెల రోజుల పాటు144 సెక్షన్ విధించారు. దీంతో అక్కడి అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇకపోతే ఇప్పటికే ఈ హత్యను ఉగ్రవాద సంబంధిత ఘటనగా పరిగణిస్తోన్న కేంద్ర ప్రభుత్వం... దర్యాప్తునకు ఆదేశించింది.

ఇక ఈ ఘటనపై స్పందించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇది విచారకరమైన & అవమానకరమైన సంఘటనగా అభివర్ణించిన ఆయన...  ఈ ఘటనతో దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని..  ప్రధాని & అమిత్ షా ఈ విషయంపై స్పందించాలని కోరారు. ఇలాంటి హింసను సహించబోమని, యువ‌త‌ అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌కు పాల్పడొద్దని.. శాంతియుతంగా ఉండాలని  విజ్ఞప్తి చేయాలని ప్రధాని ప్రజలను ఉద్దేశించి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.