బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో నిరుద్యోగ దీక్ష: లైవ్ అప్‌డేట్స్‌

బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో నిరుద్యోగ దీక్ష: లైవ్ అప్‌డేట్స్‌

జనవరి లోపు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీని అడ్డుకుంటాం

జనవరిలోగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామన్నారు  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. బీజేపీ నిరుద్యోగ దీక్షలో మాట్లాడిన ఆయన.. బీజేపీ దీక్ష అంటే కేసీఆర్ కు వణుకు పుట్టిందన్నారు. బీజేపీ నిరుద్యోగ దీక్షకు వేలాది మంది కార్యకర్తలు తరలివస్తున్నారనే సమాచారంతో కేసీఆర్ కొవిడ్  గుర్తుకొచ్చిందన్నారు. భయంతోనే బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతివ్వలేదన్నారు.  నిరుద్యోగుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించదా అని ప్రశ్నించారు. విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యోగాలు సాధించని తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులపై  కేసీఆర్ కు కక్ష్య ఎందుకన్నారు. ఉద్యోగాల కోసం దీక్షలు చేయాల్సి వస్తుందనుకోలేదన్నారు.

విద్యా వాలంటీర్లను తొలగించిన మూర్ఖుడు కేసీఆర్ అని అన్నారు బండి సంజయ్.  గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారన్నారు. ఫిల్డ్ అసిస్టెంట్లను పీకేశారన్నారు. లక్షా 90 వేల ఉద్యాగాల ఖాళీగా ఉన్నాయనని బిశ్వాల్ కమిటీ చెప్పిందన్నారు. జనవరి లోపల  వెంటనే ఉద్యోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే కేసీఆర్ ను తిరగనివ్వమన్నారు. అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ, బయట బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ నడవకుండా  అడ్డుకుంటారన్నారు.  కేసీఆర్ ను అడిగితే దొంగ దీక్షలు  ఎలా  చేయాలో చెబుతారన్నారు. ఖమ్మంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారన్నారు. ఇంటర్ ఫలితాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను బండి సంజయ్ ఆదుకోవాలన్నారు.

2023 తర్వా త ఉజ్వల భవిష్యత్

ఏడేళ్ల పాలనలో కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు మింగిండని..నియామకాలేమో ఇంట్లో ఇచ్చుకున్నాడన్నారు ఎంపీ అర్వింద్. తెలంగాణ ఆస్తులన్ని పొతం పట్టిండు..నిరుద్యోగులను ఎండబెట్టిండన్నారు.  ఇంట్లో ఉద్యోగాలు ఇస్తా అన్న మాట కేసీఆర్ మర్చిపోయిండన్నారు. కేటీఆర్ ప్రైవేట్ జెట్ లకు  డబ్బులెక్కడివన్నారు. ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. సర్కార్ పై ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉన్నారన్నారు. ఇవాళ కేసీఆర్ అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. బీజేపీతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు.ఎవరు నిరాశపడద్దని.. 2023 తర్వా త బండి సంజయ్ నాయకత్వంలో ఉజ్వల భవిష్యత్త్ ఉంటుందన్నారు.

నిరుద్యోగులను TRSఎన్నికల కోసమే ఉపయోగించుకుంది

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నిరుద్యోగ యువత కలలను కల్లలుగా చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ని పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టింది బీజేపీ. ఈ దీక్షలో పాల్గొన్న ఈటల... సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలపై ఫైర్ అయ్యారు. నిరుద్యోగులను  టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసమే ఉపయోగించుకుందన్నారు. వెంటనే నోటిఫికేన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో కూడా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలోనూ  విఫలమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేది బీజేపీయేనన్న ఈటల.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు అండగా ఉంటుందన్నారు.

అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈటల. కొందరు అధికారులు ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుడటం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనమని ఎప్పుడు చెప్పలేదని.. కేవలం ఉప్పుడు బియ్యం మాత్రమే కొనమని చెప్పిందన్నారు. నన్ను ఏ ప్రభుత్వం భయపెట్టలేదని చెప్పిన కేసీఆర్...కేంద్రం తన మెడ మీద కత్తి పెట్టిందని  చెప్పడం  సిగ్గు చేటుగా ఉందన్నారు.పేదలకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి  ప్రజల ఉసురు తగులుందన్నారు.

ఉద్యోగాలు కల్వకుంట్ల కుటుంబానికి.. నిధులు మెఘా కృష్ణారెడ్డికి

కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదన్నారు. కానీ కౌన్సిల్ ఎన్నికలు, హుజురాబాద్,హుజుర్ నగర్ ఎన్నికలప్పుడు 50 వేల ఉద్యోగాలిస్తామని చెప్పినా ఇంత వరకు ఇవ్వలేదన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఖాళీగా ఉన్నలక్షా 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీ ఒపెన్ చేసి ఐదు వేల ఉద్యోగాలిప్పిస్తామని ఎన్నికల మేనిఫేస్టోలో పెట్టినా టీఆర్ఎస్ హామీ నెరవేర్చలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు సాధించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు   ఉద్యోగాలేమో కల్వకుంట్ల కుటుంబానికి.. నిధులేమో కాంట్రాక్టర్  మెఘా కృష్ణారెడ్డికి ఇస్తున్నారన్నారు.  తెలంగాణలో కాంట్రాక్టర్లు ఉన్నా ఆంధ్రా కాంట్రాక్టర్లు ప్రోత్సహిస్తున్నారన్నారు.
 

 నా కష్టం మరొకరికి రావొద్దు

ఇటీవల  ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి రవీంద్ర నాయక్ భార్య రజిత ఆమె  పిల్లలు బీజేపీ నిరుద్యోగ దీక్షలో పాల్గొన్నారు. తన భర్త తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడన్నారు.   పీహెచ్ డీ చేసిన తన భర్త ఉద్యోగం రాలేదనే ఆవేదనతో ఆత్మ హత్య చేసుకున్నాడన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నోటిఫికేషన్ లు జారీ చేయాలని కోరారు. తనకు వచ్చిన కష్టాలు మరొకరికి రావొద్దంటూ ఆవేదన చెందారు.  ఆత్మ హత్య చేసుకున్నప్పుడు అన్ని పార్టీల నాయకులు  వచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు..కానీ ఇంత వరకు ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇద్దరు పిల్లలతో కష్టాలు పడుతున్నానని.. ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. ఉపాధి కల్పిస్తే తన పిల్లలను పోషిస్తానన్నారు.

కేసీఆర్ ఉద్యోగం పోతే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు:తీన్మార్ మల్లన్న

తెలంగాణలో నిరుద్యోగ యువత తీవ్ర అసహనంతో ఉందన్నారు బీజేపీ నేత తీన్మార్ మల్లన్న. ఇవాళ నిరుద్యోగ దీక్షకు వస్తున్న వేలాది మంది తరలివస్తుంటే వారిని అరెస్ట్ చేశారన్నారు. ఈ విధంగా దీక్షలను అడ్డుకుంటూ..ప్రతిపక్షాల గొంతు నొక్కడమే తప్ప..కేసీఆర్ సమాజానికి చేసిందేమి లేదన్నారు.డిగ్రీ చదివిన వాళ్లకు ఉద్యోగాలివ్వాలా? అని ప్రభుత్వం అంటుందని..మరి ఐదో తరగతి చదువుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారన్నారు. కేసీఆర్ ఉద్యోగం, తన కుటుంబ ఉద్యోగాలు పోతే..తప్ప నిరద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు.తెలంగాణ రాకపోతే ఇవాళ  కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చేవా ? అని ప్రశ్నించారు. ఏడేళ్ల పాలనలో ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు.

రాష్ట్రం కోసం పోరాడి.. ఉద్యోగం కోసం చనిపోవద్దు

పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. కానీ ఇవాళ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడి... పెంచి పెద్ద చేస్తారన్నారు. అలాంటి పిల్లలు ఇవాళ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి నిరుద్యోగులంతా తమ తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు పోరాటం చేయాలన్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదన్నారు. ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన యువత... ఇవాళ ఉద్యోగం కోసం చనిపోవడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రతీ సమస్యకు అనేక పోరాటాలన్నారు. పిరికితనం కాదు ఎదురు తిరగాలన్నారు.కేసీఆర్ ప్రభుత్వంపై యువత పోరాడాలన్నారు.  ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ ఏడేళ్ల పాటు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తే.. జీతాలు ఇవ్వాలన్నారు. కానీ జీతాలు ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని విమర్శించారు విజయశాంతి. మీ కోసం భారతీయ జనతా పార్టీ పోరాడుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిరుద్యోగుల కోసం పోరాడాలన్నారు. ఉద్యోగులు పెన్ డౌన్ చేయమని నేను అడగడం లేదు కానీ.. ఓ గంట పాటు నిరుద్యోగాల కోసం గొంతు విప్పాలన్నారు రాములమ్మ. మీ తమ్ముళ్లకు ధైర్యం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలని విజయశాంతి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసే ధైర్యం సత్తా యువతకు ఉందన్నారు. మీకోసం భారతీయ జనతా పార్టీ ఉందన్నారు విజయశాంతి. 

సీఎం కేసీఆర్‌‌కు తరుణ్ చుగ్ సవాల్‌

తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీసులో చేపట్టిన నిరుద్యోగ దీక్షలో రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్‌ తరుణ్ చుగ్.. కేసీఆర్ సర్కారు విధానాలను తప్పుబట్టారు. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారన్నారు. ఈరోజు ఉద్యమ కారులంతా బీజేపీ వెంట నడుస్తున్నారన్నారు. కేసీఆర్ నిరుద్యోగుల్ని మోసం చేశారన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన యువతను సీఎం మరిచిపోయారన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌‌కు తరుణ్ చుగ్ బహిరంగ సవాల్ చేశారు. ఏడేళ్ల పాటు మీరేం చేశారు? బండి సంజయ్ తో బహిరంగ చర్చకు సిద్ధమా ? అంటూ సవాల్ చేశారు.  ఏడేళ్ల మోదీ పాలన.. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. 

ఉద్యోమ ద్రోహులకు టీఆర్ఎస్ పెద్ద పీట వేస్తోందన్నారు. నిరుద్యోగ దీక్షకు వస్తున్న నేతల్ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు తరుణ్ చుగ్. కరోనా మహమ్మారి కోసం మీరేం చేశారు ? పేదలకోసం మీరేం ఏం చేశారు ? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇవాళ దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి  మోడీ సర్కార్ ఉచితంగా బియ్యం అందిస్తోందన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ సర్కార్ ఫ్రీ టీకా ఇవ్వలేదన్నారు. దేశప్రజలకు ఉచితంగా మోడీ సర్కార్ వ్యాక్సిన్ ఇచ్చిందన్నారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలకు చేసుకుంటున్నారన్నారు. ఉద్యోగాలు లేక అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. డిగ్రీలు, చదువులు మాని... తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొందన్నారు. ఆ యువత చేసిన పోరాటంతో కేసీఆర్ అధికార పీఠం ఎక్కారన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని కేసీఆర్.. యువతను మభ్య పెట్టారన్నారు. ఇన్నేళ్లు గడిచినా... బంగారు తెలంగాణ మాత్రం రాలేదన్నారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడ్డాయన్నారు. ప్రతీ ఇంటికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆ హామీ ఏమైంది అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీం అని తరుణ్ చుగ్ ఆరోపించారు. బంగారు తెలంగాణ వచ్చే వరకు ప్రతీ బీజేపీ కార్యకర్త పోరాడాలని పిలుపు నిచ్చారు. 

రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్ నేతల అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న నిరుద్యోగ దీక్షకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ నేతలను వేములవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు.

మహబూబ్ నగర్‌‌ నుంచి నిరుద్యోగ దీక్షకు బయలుదేరి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, ఇతర జిల్లా నాయకులను అరెస్టు చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

టీఆర్‌‌ఎస్ పాలనకు అంతానికి టైమ్ దగ్గరపడ్డది

బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు మెడికల్, హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు నేరుళ్ల గంగారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. కానీ కేసీఆర్ సర్కారు వచ్చాక వీటిలో ఏ ఒక్కదాన్నీ పట్టించుకోలేదని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థనే తనకు నచ్చదని, దీనిని లేకుండా చేయాలన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడుస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా కొనసాగిస్తునారని అన్నారు. కనీసం నెల నెలా కనీసం సక్రమంగా జీతాలు ఇవ్వని కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కరోనా టైమ్‌లో ఫ్రంట్‌ లైన్ వారియర్లుగా ఉన్న  హెల్త్, మెడికల్ స్టాఫ్‌ను శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఒత్తిడి గురి చేస్తున్నారని అన్నారు. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో సైతం ఉద్యోగులను భర్తీ చేయపోవడం దారుణమన్నారు. నిరుద్యోగులంతా పోరాడి టీఆర్‌‌ఎస్‌ను గద్దె దించాలన్నారు.

ఆత్మహత్యలు వద్దు.. టీఆర్‌‌ఎస్‌ సర్కారుకు ఉరి వేయాలె

తెలంగాణ వస్తేనే మన కొలువులు మనకు దక్కుతాయని కొట్లాడిన యువకులు, నిరుద్యోగులను తెలంగాణ సర్కారు మోసం చేస్తోందని బీజేపీ యువజన మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ అన్నారు. రాష్ట్రం వచ్చాక ఏర్పడిన టీఆర్‌‌ఎస్ సర్కారు నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టలేదన్నారు. ఇటువంటి పాలన కోసమా తాము అత్మబలిదానాలు చేసుకుంది అని 1200 మంది తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, కుటుంబానికి తాము భారం కాకూడదని యువకులు 250 మంది వరకూ ప్రాణాలు తీసుకున్నారన్నారు. నిరుద్యోగులకు అండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇందిరా పార్కులో ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టాలని పూనుకుంటే రాష్ట్ర సర్కారు కరోనా పేరుతో అనుమతి ఇవ్వలేదని భాను ప్రకాశ్ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కన్నా కల్వకుంట్ల వైరస్ ప్రమాదకరమని, కరోనాతో మరణించిన వారి కంటే కల్వకుంట్ల అరాచకాల వల్ల మరణించిన వారే ఎక్కువ అని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలని, గత ఎన్నికల ముందు నెలకు 3016 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, 36 నెలలు గడుస్తున్నా యువతకు రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు బాకీ పడిన ఈ భృతి మొత్తం రూ.1,05,560 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు బీజేపీ అండగా ఉంటుందని, యువకులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఉరి వేసుకోవాల్సింది వాళ్లు కాదని, టీఆర్ఎస్ సర్కారుకు ఉరి వేయాలని భాను ప్రకాశ్ పిలుపునిచ్చారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సర్కారు ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ కొలువుల్లోనూ తెలంగాణ యువతకు పెద్ద పీట వేస్తామని చెప్పారు.

నిరంకుశ విధానాలను ఇప్పటికైనా మానుకో

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, పలువురు నేతలను టీఆర్‌‌ఎస్ సర్కారు అక్రమ అరెస్టు చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్‌‌ఎస్ ఎన్ని అప్రజాస్వామ్య విధానాలను అవలంబించి, అణచివేతలకు పాల్పడినా బీజేపీ దినదినాభివృద్ధి చెందుతుందే కానీ, వెనక్కి తగ్గదని చెప్పారు. ఇప్పటికైనా నిరంకుశ విధానాలను మానుకోవాలని హెచ్చరించారు.

నిరుద్యోగ దీక్ష వద్దకు చేరుకున్న ఈటల

రాష్ట్రంలో ఖాళీ ఉన్న ప్రభుత్వ కొలువులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు చేపడుతున్న నిరుద్యోగ దీక్ష వేదిక వద్దకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేరుకున్నారు. రాష్ట్రంలో అనేక మంది బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నప్పటికీ.. అన్ని నిర్బంధాలను తప్పించుకుని దీక్ష వద్దకు చేరుకున్నారు ఈటల.

బైంసాలో బీజేపీ నేతల అరెస్ట్

నిర్మల్ జిల్లా బైంసా డివిజన్‌లో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో బీజేపీ నిరుద్యోగ దీక్షకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

మెదక్ జిల్లాలో బీజేపీ నేతల అరెస్ట్

బీజేపీ  చేపడుతున్న నిరుద్యోగుల దీక్షకు వెళ్తున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు మెదక్ పోలీసులు. మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు తరలి వెళ్తున్న నేతలను  అరెస్ట్ చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఎంపీ ధర్మపురి అర్వింద్ హౌస్ అరెస్ట్

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరై దీక్షను ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలు నేతలు దీక్షలో పాల్గొంటున్నారు. అయితే దీక్షలో భాగస్వామ్యం కాకుండా చేసేందుకు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇక నిరుద్యోగ దీక్షకు వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. జగిత్యాలలో బీజేపీ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 15 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మొదట ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేయాలని నిర్ణయించారు. ఐతే పోలీసులు అనుమతి నిరాకరించడంతో వేదికను పార్టీ ఆఫీస్ కు మార్చారు. నిరుద్యోగ దీక్షకు భయపడే సర్కార్ ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసిందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగే నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలని కోరారు ఆ పార్టీ నేతలు.

దీక్షకు జిల్లాల నుంచి తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ నేతలు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్. కరోనా రూల్స్ కు లోబడి పార్టీ ఆఫీస్ లో దీక్ష చేస్తుంటే అభ్యంతరం ఏంటో చెప్పాలన్నారు. దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్ నియంత, అహంకార పాలనకు నిదర్శమన్నారు సంజయ్. ఉద్యోగ, ఉపాధి కరువై లక్షల మంది యువతీ, యువకులు అల్లాడుతున్నా ప్రభుత్వం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు సంజయ్.

మరోవైపు జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారో చెప్పకుండా మంత్రి కేటీఆర్ బండి సంజయ్ పై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బహిరంగ లేఖ పేరుతో నిరుద్యోగ దీక్షపై కేటీఆర్ చేసిన విమర్శలు నిరుద్యోగులను అవమానించడమేనని విమర్శించారు. ఏడేళ్లుగా ఉద్యోగాలంటూ ఊరిస్తుండడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇప్పటివరకు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు రాజాసింగ్.