ధూల్ పేట‌లో నిశ్చితార్ధం-15 మందికి కరోనా పాజిటివ్

ధూల్ పేట‌లో నిశ్చితార్ధం-15 మందికి కరోనా పాజిటివ్

హైదరాబాద్  ధూల్ పేట‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఎంగేజ్మెంట్ 15 మందికి క‌రోనా సోకేలా చేసింది. హైదరాబాద్ జుమ్మేరాత్‌బజార్ జుంగూర్ బస్తీలో నివసిస్తున్న ఓ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (38) తండ్రి శ‌నివారం రోజు చనిపోయారు. దీంతో అధికారుల‌కు అనుమానం వ‌చ్చి ఆరా తీస్తే క‌రోనా మ‌ర‌ణం అని తేలింది. దీంతో మేనేజ‌ర్ తో స‌హా అత‌డి కుటుంబ స‌భ్యులు 30 మందిని కారంటైన్ కి త‌ర‌లించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారిలో 15 మందికి క‌రోనా తేలింది. దూల్ పేట్ లో  నిశ్చితార్థం జరిపిన పెళ్లికొడుకు కుటుంబంలో వారు స‌భ్యుల‌ని తేలింది. ఈ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో శనివారం మరణించడంతో ఈ కేసులన్నీ బయటపడ్డాయి. ఎంగేజ్ మెంట్ మే 11న హైదరాబాదులోని ధూల్ పేట్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి లాక్ డౌన్ నిబంధనలు, భౌతికదూరం సూచనలు పక్కనబెట్టి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరైనట్టు సమాచారం. ఇప్పుడు వారందరి వివరాలు సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.