స్కూల్ ఎగ్జామ్స్ కు వెళుతూ 15 ఏళ్ల బాలికకు గుండెపోటు

స్కూల్ ఎగ్జామ్స్ కు వెళుతూ 15 ఏళ్ల బాలికకు గుండెపోటు

దేశవ్యాప్తంగా యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.  తాజాగా గుజరాత్‌లోని అమ్రేలిలో 15 ఏళ్ల బాలిక అనుమానాస్పద గుండెపోటుతో మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సాక్షి రాజోసర అనే బాలిక తన 9వ తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు పాఠశాలకు వెళుతుండగా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.  అయితే ఆమె మరణం వెనుక  ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడలేదు.  

కాగా గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండె ఆగిపోయే కేసులు పెరుగుతున్నాయి. కరోనా తరువాత యువతలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి.  ఇంతకుముందు 10 మందిలోఒకరు మాత్రమే 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు గుండెపోటుకు గురయ్యేవారిని , కానీ ఇప్పుడు 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 10 మంది రోగులలో ముగ్గురిని చూస్తున్నామని  అహ్మదాబాద్‌లోని ఓ కార్డియాలజిస్ట్  తెలిపారు.  

ALSO READ :- NZ vs PAK: పళ్లు లేని ముసలోళ్లు నవ్వుతున్నట్లు ఉంది: పాక్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు