అమానవీయ ఘటన.. దారుణమైన మూకదాడి..బట్టలూడదీసి, చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. నగ్నంగా అతి కిరాతకంగా కొట్టుకుంటూ కిలోమీటరున్నర దూరం పరుగెత్తించారు. 16 ఏళ్ల బాలుడిని నగ్నంగా, తాళ్లతో కట్టేసి ఊరంతా తిప్పిని అనాగరిక ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతంలో ఓ మైనర్ బాలుడిని నగ్నంగా ఊరంతా తిప్పుతూ తీవ్రంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను అపహరించాడని నెపంతో మైనర్ పై దాడి చేసిన మహిళలతో సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే.. ?
ఉజ్జయిని ప్రాంతంలోని పన్వాస పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే బంజారా కమ్యూనిటీకి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు, అదే కమ్యూనిటికీ చెందిన మైనర్ బాలిక ప్రేమించుకుంటున్నాం అని ఇంట్లోంచి పారిపోయారు. 18 రోజుల తర్వాత పన్వాస పోలీస్ స్టేషన్ కు వచ్చి రక్షణ కావాలని కోరారు. ఈ విషయంతో తెలియడంతో బాలిక పేరెంట్స్, బంధువులు పోలీస్ స్టేషన్ కు వచ్చి బాలుడిపై ఫిర్యాదు చేశారు.దీంతో మైనర్ ను జువైనల్ హోంకు పంపించారు. జైలు నుంచి వచ్చాక తల్లితో కలిసి సమీప గ్రామంలో బంధువుల ఇంట్లో ఉంటున్నారు.
►ALSO READ | నీ వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు : వీడియో తీసిన మహిళ షింజితపై కేసు
ఈ క్రమంలో మైనర్ తల్లి అరోగ్యం క్షీణించింది. చికిత్సకు డబ్బులు కావాల్సి ఉండగా స్నేహితులను అడిగేందుకు పన్వాస ప్రాంతానికి వెళ్లాడు. విషయం తెలుసుకన్న అమ్మాయి తరపున బంధువులు మైనర్ పై దాడికి పాల్పడ్డారు. బట్టలు చించి, చేతులువెనక్కి విరిచి తాళ్లతో కట్టేశారు. అనంతరం వీధుల్లో తిప్పుతూ దారుణంగా కొట్టారు.
ఈ దారుణాన్ని అందరూ చూశారు గానీ ఏ ఒక్కరూ సాయం చేయలేదని బాధిత బాలుడు పోలీసులతో వాపోయాడు. ఈఘటనపై ఆ టీనేజర్ ,అతని దివ్యాంగురాలైన తల్లి పన్వాస పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
