నీ వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు : వీడియో తీసిన మహిళ షింజితపై కేసు

నీ వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు : వీడియో తీసిన మహిళ షింజితపై కేసు

బస్సులో లైంగిక వేధింపుల వీడియో కారణంగా 42 ఏళ్ళ వ్యక్తి చనిపోయిన ఘటనలో  యువతిపై కేసు ఫైల్ చేరశారు పోలీసులు. కేరళలోని వడకరకు చెందని షింజిత ముస్తఫాపై ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు నమోదు చేశారు. బస్సుప్రయాణంలో తను లైంగికంగా వేధించాడని షింజిత ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో  కేరళలోని గోవిందపురానికి చెందిన దీపక్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈఘటన కేరళలో కలకలం రేపింది. 

బట్టల కంపెనీలో పనిచేస్తున్న దీపక్ నాలుగు రోజుల క్రితం కన్నూర్ కు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా అదే బస్సులో ప్రయాణిస్తున్న ముస్తాఫా .. దీపక్ తనతో అసభ్యంగా తాకాడని  ఆరోపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియో దీపక్ దృష్టికి రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతని బంధువులు తెలిపారు. బాధితుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

►ALSO READ | మహిళలతో రాసలీలల కేసు.. సీనియర్ పోలీస్ అధికారి సస్పెండ్

ఈ ఘటనపై కేరళ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. సమగ్ర దర్యాప్తు చేసి వారంలోపు రిపోర్టు ఇవ్వాలని డీఐజీని ఆదేశించింది. ఫిబ్రవరి 19న ఈ కేసును కమిషన్ పరిశీలించనుంది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆర్థిక లాభం కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పెరుగుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.