మహిళలతో రాసలీలల కేసులో సీనియర్ పోలీస్ అధికారి రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆఫీసులోనే పలువురు మహిళలతో రామచంద్రరావు సన్నిహితంగా ఉన్నట్లు చూపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం ఆయనపై సస్సెన్షన్ వేటు వేసింది.
ప్రభుత్వ కార్యాలయంలో డీజీపీ హోదా ఉన్న అధికారి రామచంద్రరావు ప్రవర్తనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. ఈ విషయం సీఎం సిద్దరామయ్య దాకా వెళ్లడంతో రాజకీయంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో సోమవారం రామచంద్రరావు తీరుపై పోలీస్ శాఖను వివరణ కోరగా మరుసటి రోజు సస్పెండ్ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
డీజీపీ స్థాయి పోలీస్ అధికారి అయిన రామచంద్రరావు గతంలో బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు రన్యారావు తండ్రికావడం గమనార్హం.తాజా వీడియోల్లో ఆయన తన ఆఫీసులో యూనిఫాంలోనే మహిళలను కౌగలించుకొని, ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలు కనిపించాయి. ఈ విజువల్స్ డీజీపీ కార్యాలయంలో సిసీ ఫుటేజీ గా ప్రచారం జరుగుతోంది. పనివేళల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు రికార్డయ్యింది.
►ALSO READ | ప్రభుత్వ పథకాలు పేదలందరికీ అందించే వరకు జీతం తీసుకోను! : కలెక్టర్ అరుణ్ కుమార్
అయితే ఈ ఆరోపణలను రామచంద్రరావు ఖండించారు.వైరల్ అవుతున్న వీడియోలు మార్పింగ్ చేసినవని, కొందరు తనను లక్ష్యంగా ఈ వీడియోలు రిలీజ్ చేశారని ఆరోపించారు. అయినప్పటికీ ఈ వివాదం సీఎం వరకు చేరడంతో రామచంద్రరావును సస్పెండ్ చేశారు.
