
రాజస్థాన్లోని గ్వాలియర్ కోట ముందు 1500 మంది తబలా వాయిద్యకారులు గిన్నిస్ రికార్డు సృష్టించారు. తాన్సేన్ మహోత్సవంలో భాగంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన వాయిద్యకారులు ఏకకాలంలో ‘తాళ్ దర్బార్’ వాయించారు. ఈ ప్రదర్శనను దగ్గరుండి పర్యవేక్షించిన గిన్నిస్ ప్రతినిధులు.. ప్రదర్శన పూర్తయ్యాక గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ను నిర్వాహకులకు అందజేశారు.