- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ నేతలు వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకే ఇంటి చిరునామాతో వేల సంఖ్యలో బోగస్, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒకే అడ్రస్‌పై 15, అంతకంటే ఎక్కువ ఓట్లు నమోదై ఉన్న సుమారు 1.63 లక్షల హై-డెన్సిటీ ఓట్లను గుర్తించినట్లు వెల్లడించింది.
ఈ మేరకు ఓటరు జాబితా ప్రక్షాళన చేపట్టాలని, తప్పుల తడకగా మారిన జాబితాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి బీజేపీ ఎన్నికల కమిషన్ బృందం బుధవారం వినతి పత్రం అందజేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఈఆర్‌వో నెట్ సాఫ్ట్‌వేర్ ద్వారా డీఎస్‌ఈ, పీఎస్‌ఈ అల్గారిథమ్‌లు తప్పులను గుర్తిస్తున్నప్పటికీ.. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఫారం-7 నోటీసులు ఇవ్వడంలో వెనుకబడి ఉన్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
