ఏపీ ఎమ్మెల్యేల్లో 163మంది కోటీశ్వరులే

ఏపీ ఎమ్మెల్యేల్లో 163మంది కోటీశ్వరులే
  • అత్యంత సంపన్నుడిగా చంద్రబాబు
  • రెండో స్థా నంలో వైఎస్ జగన్
  • 96 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
  •  ఏడీఆర్‌ రిపోర్ట్ లో వెల్లడి

ఏపీలో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 163 మంది కోటీశ్వరులే ఉన్నట్లు అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ డెమోక్రటిక్‌రిఫార్మ్స్‌‌‌‌‌‌‌‌(ఏడీఆర్‌‌‌‌‌‌‌‌) ఆదివారం వెల్లడించింది. నామినేషన్ సమయంలో అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఆస్తులు,ఆదాయం, కేసులు ఇతర వివరాలతో కూడిన రిపోర్ట్ ను విడుదల చేసింది. ఈసీ వెబ్ సైట్ లో చోడవరం వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మారి అఫిడవిట్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన వివరాలు ప్రకటించలేదని రిపోర్ట్ లో పేర్కొంది. ఎమ్మెల్యేల్లో 5 కోట్లకుపైగా ఆస్తులున్నవారు 117 మంది, రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లలోపు ఉన్నవారు 25 మంది, రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లలోపు ఆస్తులు కలిగినవారు 27 మంది ఉన్నట్లు తెలిపింది.రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలలోపు ఆస్తులు ఉన్న ఎమ్మెల్యే లు నలుగురే ఉన్నారు . ఒక ఎమ్మెల్యే ఆస్తులు మాత్రం రూ.10 లక్షల్లోపు ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడిం చింది.

అత్యంత సంపన్నుడు చంద్రబాబు

అత్యధిక ఆస్తులు కలిగిన టాప్‌ టెన్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే ల జాబితాలో రూ.668 కోట్లతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మొదటి స్థానంలో నిలిచారు .రూ.510 కోట్లతో వైఎస్సార్‌‌‌‌‌‌‌‌సీపీ అధినేత వైఎస్‌‌‌‌‌‌‌‌ జగన్మోహన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు . రూ.274కోట్లతో  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ థర్డ్ ప్లేస్ లో నిలిచారు . వీరి తర్వాతి స్థానాల్లో కావలి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి (రూ.242 కోట్లు ), వినుకొండ ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మ నాయుడు(రూ.173 కోట్లు ), దర్శి ఎమ్మెల్యే మాడిశెట్టి వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌రావు(రూ.159కోట్లు ), పుంగనూరు ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రూ.130 కోట్లు ), చిలకలూరిపేట ఎమ్మెల్యే రజిని(రూ.128 కోట్లు ), మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్‌‌‌‌‌‌‌‌(రూ.119 కోట్లు ), గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(రూ.83 కోట్లు )ఉన్నారు .

2014లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 55మంది మళ్లీ గెలిచారు . వారిలో వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ సీపీకి చెందినవారు 37 మంది, టీడీపీకి చెందినవారు 18 మంది ఉన్నారు . వీరిలో ఆస్తులు అత్యధికంగా పెరిగిన ఎమ్మెల్యే గా టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డు సృష్టించారు . ఆయన ఆస్తులు 2014తో పోలిస్తే ఈ ఎన్నికల నాటికి 277 శాతం పెరిగాయి.2014 ఎన్నికల అఫిడవిట్‌ లో ఆయన ఆస్తులను రూ.117 కోట్లు ఉంటే ఈసారి రూ.668 కోట్లు గా చూపారు. ఐదేళ్లలో ఆయన కుటుంబ ఆస్తులు ఏకంగా రూ.491 కోట్లు (277 శాతం) పెరగడం గమనార్హం. తర్వాతి స్థానంలో వైఎస్ జగన్ ఉన్నారు . 2014లో ఆయన ఆస్తులను రూ.416కోట్లు గా చూపగా, 2019లో రూ.510 కోట్లు గా ప్రకటించారు . ఐదేళ్లలో ఆయన ఆస్తులు రూ.93కోట్లు (22 శాతం) పెరిగాయి. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆస్తులు 2014లోరూ.155 కోట్లు ప్రకటించగా, 2019లో రూ.242కోట్లు గా  వెల్లడించారు . ఆయన ఆస్తులు ఐదేళ్లలో రూ.87 కోట్లు పెరిగాయి.

ఎమ్మెల్యే ధనలక్ష్మికి ఆస్తి రూ.6.75 లక్షలే

అతి తక్కువ ఆస్తి కలిగిన ఎమ్మెల్యేల్లో రూ.6.75లక్షలతో రంపచోడవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మొదటిస్థానంలో నిలిచారు .రూ.25.41 లక్షలతో కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోల శ్రీబాలవీరాంజనేయస్వామి రెండో స్థానంలో,రూ.25.80 లక్షలతో  సత్యవేడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కె.ఆదిమూలం మూడో స్థానంలో ఉన్నారు .

 112 మందివి డిగ్రీ, ఆపై చదువులే

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఐదో తరగతి చదివినవారు నలుగురు, ఎనిమిది వరకు చదివినవారు తొమ్మిది మంది, టెన్త్‌‌‌‌‌‌‌‌ పాసైనవారు 13 మంది, ఇంటర్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసినవారు 33 మంది ఉన్నారు . డిగ్రీపూర్తి చేసినవారు 67 మంది ఉండగా, పీజీ పూర్తిచేసినవారు 39 మంది, డాక్టోరల్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ కలిగిన వారుఆరుగురు ఉన్నారు . వీరితోపాటు నిరక్షరాస్యు డైన ఎమ్మెల్యే ఒకరు ఉండటం గమనార్హం.

మిడిల్ ఏజ్ వాళ్లే ఎక్కువ

ఎమ్మెల్యేల్లో 51 నుంచి 60 ఏళ్ల వయసున్న వారు 70మంది, 41 నుంచి 50 ఏళ్లు ఉన్నవారు  52 మంది ఉన్నారు . 25 నుంచి 30 ఏళ్లలోపువారు ఒకరు, 31నుంచి 40 ఏళ్లు ఉన్నవారు 18 మంది, 61 నుంచి70  ఏళ్లు ఉన్నవారు 29 మంది, 71 నుంచి 80 ఏళ్ల వయసున్న ఎమ్మెల్యే లు నలుగురు ఉన్నారు .

మహిళల వేధింపు కేసుల్లో ఆరుగురు

ఎమ్మెల్యేల్లో 96 మందిపై  క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు ఉన్నాయి. వీరిలో  నేరారోపణ రుజువైతే ఐదేళ్లకు పైగా శిక్షపడే తీవ్రమైన కేసుల విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే లు 55మంది ఉన్నారు . వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై హత్య, హత్యా యత్నం కేసులు ఉన్నా యి. తుని ఎమ్మెల్యే దాడిశెట్టిరాజా, తాడిపత్రి ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డి ,రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి ,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి , తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి ,ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ,విశాఖపట్నం సౌత్‌ ఎమ్మెల్యే గణేశ్, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ,మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు,ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పై హత్యా యత్నం కేసులు ఉన్నాయి. కిడ్నాప్‌ కేసుల్లో  ఏడుగురు ఎమ్మెల్యే లు నిందితులుగా ఉన్నారు . ఆరుగురు ఎమ్మెల్యే లు మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు .