వికారాబాద్ రైల్వే స్టేషన్ లో 17 కిలోల గంజాయి సీజ్

వికారాబాద్ రైల్వే స్టేషన్ లో 17 కిలోల గంజాయి సీజ్

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ రైల్వే స్టేషన్​లో చేపట్టిన తనిఖీల్లో 17.145 కిలోల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైలు ద్వారా గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో ఎక్సైజ్, డీటీఎఫ్, ఈగల్ టీం, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా రైల్వే స్టేషన్​లో సోమవారం దాడులు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ప్లాట్​ఫామ్​పై అనుమానాస్పదంగా ఉన్న ఒక లగేజీ బ్యాగ్​ను తెరిచి చూడగా భారీగా గంజాయి లభ్యమైంది. అయితే ఈ గంజాయిని రవాణా చేస్తున్న నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదని, వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని అధికారి విజయభాస్కర్ తెలిపారు.