
18 కోట్ల మందిలో యాంటీబాడీస్
వీళ్లెవరికీ కరోనా వచ్చిపోయినట్లు తెలీదు
థైరోకేర్ సంస్థ స్టడీలో వెల్లడి.. ట్విట్టర్లో తెలిపిన కంపెనీ ఎండీ
న్యూఢిల్లీ: దేశంలో ఓవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. టెస్టులు పెంచే కొద్దీ కేసులు బయటపడుతున్నాయి. కానీ, టెస్టులు చేయని వాళ్ళలోనూ సైలెంట్ గా ఆ మహమ్మారి చేరిపోతోంది. ఇమ్యూనిటీ పవర్ ఉన్నోళ్లలో దానంతట అదే నయమైపోతోంది. అది ఒంట్లోకి ఎంటరైనట్టు
చాలా మందికి కూడా తెలియట్లేదు. థైరోకేర్ అనే డయాగ్నస్టిక్స్ సంస్థ చేసిన స్టడీలో ఈ ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. దేశం మొత్తం మీద 18 కోట్ల మందికి కరోనా వచ్చి ఉండొచ్చని ఆ స్టడీ తేల్చి చెప్పింది. 60 వేల మందికిపైగా యాంటీబాడీ టెస్టులు చేయగా, 15 శాతం మందికి కరోనా యాంటీబాడీలున్నట్టు ఆ స్టడీలో తేలింది. ఈ మేరకు ఆ స్టడీ రిజల్స్ట్ ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆరోకియాస్వామి వేలుమణి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చాలా మందిలో వాళ్లకు తెలియకుండానే కరోనావైరస్ సైలెంట్ గా ఎంటరైపోయిందని, చాలా మందికి లక్షణాలు కూడా ఉండట్లేదని ఆయన చెప్పారు. ‘‘90 శాతం మంది ఇంకా కరోనాకు ఎక్స్ పోజ్ కాలేదు. 9 శాతం మంది ఎక్స్ పోజ్
అయినా వాళ్లకు సింప్టమ్స్ లేవు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నోళ్లకు అది ఉన్నట్టు కూడా తెలియదు. 0.9 శాతం మందికి సింప్టమ్స్ ఉన్నా.. సగటు ఇమ్యూనిటీ పవర్తో అది తగ్గిపోయింది. వాళ్లకు అది సోకినట్టు తెలియదు. 0.09 శాతం మందికి తక్కువ ఇమ్యూనిటీ ఉంది. వాళ్లకు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో వాళ్లు ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకున్నారు. 0.01 శాతం మందికి అసలు ఇమ్యూనిటీనే లేదు’’ అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. అక్రెడిటేషన్ ఉన్న ల్యాబుల్లో ఫాల్స్ పాజిటివ్ రావడం చాలా అరుదని, అందుకు ఒక శాతం మాత్రమే చాన్స్ ఉందని అన్నారు. గుర్తింపు లేని వాటి విషయంలో అది 10 నుంచి 30 శాతం వరకు ఉండొచ్చన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా జరిగి ఉండొచ్చని వేలుమణి చెప్పారు. ఏదేమైనా కరోనా మాత్రం సైలెంట్ గా చేరిపోతోందని అన్నారు.
For More News..