బీజేపీ నేషనల్ కౌన్సిల్ లో 18 మందికి చోటు

బీజేపీ నేషనల్ కౌన్సిల్ లో 18 మందికి చోటు

హైదరాబాద్​, వెలుగు: బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్లుగా 18 మందిని నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జాబితాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు చోటు కల్పించారు. మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, చంద్రశేఖర్, మాజీ ఎంపీలు రవీంద్ర నాయక్, బూర నర్స య్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, రమేశ్  రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్, వన్నాల శ్రీరాములు, రామకృష్ణా రెడ్డి, బొడిగె శోభ, రేవూరి ప్రకాశ్  రెడ్డి, ఏనుగు రవీందర్  రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఆకుల రాజేందర్, జయసుధ, మాజీ ఎమ్మెల్సీ దిలీప్  కుమార్, మాజీ మేయర్ రాజేశ్వర్ రావు ఉన్నారు..