19 వందల కిలోల రేషన్ బియ్యం సీజ్

19 వందల కిలోల రేషన్ బియ్యం సీజ్

కంటోన్మెంట్, వెలుగు: రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తూముకుంటకు చెందిన సోహన్ లాల్(35) అదే ఏరియాలో స్వీట్ షాప్ నడుపుతున్నాడు. బోయిన్ పల్లి ఏరియాలో తక్కువ రేటుకు బియ్యాన్ని కొని వాటిని ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. 

శనవారం బోయిన్ పల్లి నుంచి డీసీఎంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. డీసీఎంలో ఉన్న 1900 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోహన్ లాల్ పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.