‘1990స్’.. సినిమా టైటిల్ ఇదే.. కథేంటంటే..

‘1990స్’.. సినిమా టైటిల్ ఇదే.. కథేంటంటే..

అరుణ్ రాయదుర్గం, రాణి వరదా జంటగా నందకుమార్ సి.ఎం. దర్శకత్వంలో చంద్రశేఖర్ బి.ఎస్ నిర్మిస్తున్న చిత్రం ‘1990స్’. సోమవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన  డైరెక్టర్స్  అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్ మాట్లాడుతూ ‘కన్నడలో ఫేమస్ ఎడిటర్ జనార్థన్ గారి అబ్బాయి అరుణ్ ఈ చిత్రంతో హీరోగా మన ముందుకు వస్తున్నారు. మనసు మల్లిగే అంటే మనసు మల్లెపువ్వు అనే పొయెటిక్ బ్యానర్ పెట్టడం ప్రొడ్యూసర్ టేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూపిస్తోంది.

సినిమా మాత్రం మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేస్తూ చివరలో పొయెటిక్ టచ్ ఇవ్వడం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకుంది.  ఈ మూవీ టీమ్  అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నట్టు పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి  తెలుగులో మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉందని హీరో హీరోయిన్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.