1998లో జరిగిన బీహార్ మాజీ మంత్రి బ్రిజ్ బిహారీ ప్రసాద్ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే మున్నా శుక్లా సహా ఇద్దరికి సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్, ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పిచ్చింది. దోషులిద్దరూ 15 రోజుల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరింది.
అంతకుముందు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పాక్షికంగా కొట్టివేసింది. ఈ కేసులో మాజీ ఎంపీ సూరజ్‌భన్ సింగ్ సహా మరో ఆరుగురు నిందితులు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషులుగా ప్రకటించారు. తివారీ, విజయ్ కుమార్ శుక్లా అలియాస్ మున్నా శుక్లాలపై ఐపీసీ 302 (హత్య), 307 (హత్య ప్రయత్నం) కింద అభియోగాలు నమోదు చేశామని, 15 రోజుల్లోగా లొంగిపోవాలని బెంచ్ కోరింది.