జమ్మూకాశ్మీర్ మాజీ సీఎంపై కాల్పులు.. పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టిన దుండగుడు

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎంపై  కాల్పులు.. పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టిన దుండగుడు

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై  కాల్పులు జరిగాయి. జమ్మూలోని కౌలాష్ ప్రాంతంలో  బుధవారం (మార్చి 11) సాయంత్రం జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఫరూఖ్ పై ఈ దాడి జరిగింది. పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టి కాల్చేందుకు దుండగుడు ప్రయత్నించాడు. అయితే ఫరూఖ్ అబ్దుల్లా తృటిలో తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. 

ఈఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. ఓ పెళ్లి వేడుకలో ఫరూఖ్ అబ్దుల్లాను వెనకనుంచి వచ్చి తుపాకీ తలకు గురిపెట్టి కాల్చేందుకు దుండగుడు ప్రయత్నించాడు. అయితే ఫరూఖ్ తృటిలో తప్పించుకున్నాడు. పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరికి స్వల్ప గాయాలైనట్లు  తెలుస్తోంది. అప్రమత్తమైన ఫరూఖ్ రక్షణ సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. 

నిందితుడు 60 ఏళ్ల కమల్ సింగ్ జమ్వాల్ గా గుర్తించారు.  జమ్మూ నివాసి అయిన కమల్ సింగ్ అక్కడ కొన్ని షాపులు నిర్వహిస్తున్నాడు. గత 20  ఏళ్లు గా ఫరూఖ్ అబ్దుల్లా ను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో కమల్ సింగ్ తెలిపాడు. మాజీ సీఎం మట్టుబెట్టేందుకు లైసెన్స్డ్ గన్ తీసుకున్నట్లు నిందితుడు తెలిపాడు.