అమెరికా ఉపాధ్యక్షుడి భార్య బిడ్డతో హెలికాఫ్టర్ దిగుతూ కిందపడబోతే ఒక్కరు పట్టించుకోలే..!

అమెరికా ఉపాధ్యక్షుడి భార్య బిడ్డతో హెలికాఫ్టర్ దిగుతూ కిందపడబోతే ఒక్కరు పట్టించుకోలే..!

జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో హెలికాఫ్టర్ నుంచి దిగుతున్నప్పుడు.. అమెరికా సెకండ్ లేడీ ఉషా కిందపడబోయారు. ఉషా వాన్స్ తన బాబు అలెక్ను బేబీ క్యారియర్‌లో మోస్తూ హెలికాఫ్టర్ మెట్లు దిగుతుండగా క్షణ కాలం తడబడ్డారు. అదుపు తప్పి కిందపడబోయారు. కిందపడే లోపు ఆమె జాగ్రత్త పడటంతో ప్రమాదం తప్పింది. ఆమె వెంటనే తేరుకుని.. బిడ్డను చూసుకున్నారు. వారి కుమార్తె మిరాబెల్ను ఎత్తుకుని ఉపాధ్యక్షుడు జేమ్స్ వాన్స్ వారి వెనుకే వచ్చారు.

రిపబ్లికన్ పార్టీ నాయకుడు సెనేటర్ డాన్ సుల్లివన్‌కు (Daniel Scott Sullivan) మద్దతుగా జరిగే ప్రచార ర్యాలీ కోసం ఆ కుటుంబం అలస్కాలోని యాంకరేజ్‌కు వెళ్తోంది. ఇదిలా ఉండగా.. ఉషా వ్యాన్స్ పడబోతుంటే.. ఆమె ఎదురుగా ఉన్న సిబ్బంది కనీసం కాపాడే ప్రయత్నం కూడా చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాన్స్ దంపతులకు నలుగురు పిల్లలు, వారిలో అలెక్ 2026 జూలైలో జన్మించాడు.

►ALSO READ | ఫ్లైదుబాయ్ విమాన ఘటన వెనక ఇరాన్ హస్తం: ట్రంప్ సంచలన ఆరోపణలు

USA టుడే నివేదిక ప్రకారం.. మధ్యంతర ఎన్నికల ముందు ప్రచారం కోసం వాన్స్ అలస్కాకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. డెమొక్రాట్ మేరీ పెల్టోలాపై రిపబ్లికన్ సెనేటర్ డాన్ సుల్లివన్ తిరిగి ఎన్నికయ్యే ప్రయత్నానికి మద్దతుగా రిపబ్లికన్ నేషనల్ కమిటీ ర్యాలీకి జేడీ వ్యాన్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి జేడీ వ్యాన్స్ వెళ్లారు. వాన్స్తో పాటు ఉష, పిల్లలు వెళ్లారు. ఈ పర్యటనతో ఉష తన 50వ అమెరికా రాష్ట్రాన్ని సందర్శించారు. 7.5 గంటల ఈ ప్రయాణంలో ఉష తొమ్మిది వారాల పసికందుతో సుదీర్ఘ ప్రయాణం చేయడంతో అలసిపోయారు.