PAK vs AFG: ఫలించిన పాక్ ఆటగాళ్ల శ్రమ.. ఈ ఏడాదిలో మొదటి సిక్స్ కొట్టారు

PAK vs AFG: ఫలించిన పాక్ ఆటగాళ్ల శ్రమ.. ఈ ఏడాదిలో మొదటి సిక్స్ కొట్టారు

హమ్మయ్య ఎట్టలకే పాక్ వరల్డ్ కప్ లో సిక్సుల ఖాతా తెరిచింది. ఆఫ్ఘనిస్తాన్ పై తమ మొదటి సిక్సును నమోదు చేసింది.  అదేంటి పాకిస్థాన్ చాలా సిక్సులు కొట్టింది కదా అనుకోవచ్చు. ఇప్పటివరకు నాలుగు మ్యాచులాడిన పాక్ చాలా సిక్సులు కొట్టింది. కానీ పవర్ ప్లే లో మాత్రం ఇదే తొలి సిక్స్ కావడం విశేషం. 

ఆఫ్ఘన్ పేస్ బౌలర్ నవీన్ ఉల్ హక్ వేసిన ఐదవ ఓవర్ మూడో బంతికి షఫీక్ సిక్సర్ బాదేశాడు. దీంతో 1168 బంతుల తర్వాత పవర్ ప్లే లో పాక్ టీం సిక్సర్ కొట్టింది. ఈ టోర్నీలో పాక్ తొలి 10 ఓవర్లలో ఒక్క సిక్సర్ కొట్టకపోవడంతో ఆ జట్టుపై ట్రోల్స్ నడిచాయి. తాజాగా సిక్సర్ కొట్టి అందరిని సర్ ప్రైజ్ చేశాయి.       

ALSO READ : హైదరాబాద్ అపార్ట్ మెంట్ లో దసరా పూజ.. దీపం పడి చెలరేగిన మంటలు

వరల్డ్ కప్ లో భాగంగా  పాకిస్థాన్ -ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య  చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ప్రస్తుతం పాక్ జట్టు 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు ఇమాముల్ హఖ్, అబ్దుల్లా షఫీక్ తొలి వికెట్ కు 56 పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్ని అందించారు.  ఇమామ్ 17 పరుగులు చేసి అవుట్ కాగా.. బాబర్ అజాం(16) అబ్దుల్లా షఫీక్ (41) క్రీజ్ లో ఉన్నారు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)