విమానంలో తాగిన మత్తులో.. మందు ఎక్కువై..

విమానంలో తాగిన మత్తులో.. మందు ఎక్కువై..

విమాన ప్రయాణం అంటే డీసెంట్.. అందరూ ఎలైట్ పీపుల్స్.. పద్దతిగా ఉంటారు అనే  టాక్.. మొన్నటి వరకు అలాగే ఉంది.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. విమానంలో గొడవలు కామన్ అయ్యాయి. ఎంతలా అంటే.. 2023 జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడు సంఘటనలు జరిగాయి. ఒకరు మూత్రం పోస్తే.. మరొకరు ఉమ్మి వేయటం.. మరొకరు సీటు కోసం కొట్టుకోవటం వంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. 

లేటెస్ట్ గా.. మార్చి 22వ తేదీ బుధవారం ఇండిగో విమానంలో తాగిన మత్తులో.. మందు ఎక్కువై.. ఇద్దరు వ్యక్తులు బీభత్సం చేశారు. తోటి ప్రయాణికులను బండ బూతులు తిట్టారు. దాడి చేశారు. సర్దిచెప్పటానికి ప్రయత్నించిన  కో పైలెట్, ఎయిర్ హోస్టస్ పై దాడికి ప్రయత్నించారు ఆ ఇద్దరు ప్రయాణికులు. దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో ఫ్లయిట్ లో ఈ ఘటన జరిగిందని.. గొడవ చేసిన ప్రయాణికులు ఇద్దరినీ.. ముంబైలో ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు పోలీస్ అధికారులు. 

ఆ ఇద్దరు ప్రయాణికులను కోర్టులో హాజరుపరిచామని.. వారికి బెయిల్ కూడా వచ్చినట్లు వెల్లడించారు ముంబై ఎయిర్ పోర్ట్ పోలీస్ అధికారులు. వారిద్దరూ మహారాష్ట్రలోని పాల్ఘర్, కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన వారని.. గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్నారని.. ఏడాది తర్వాత ఇండియాకు తిరిగి వస్తున్నట్లు తెలిపారు అధికారులు. డ్యూటీ ఫ్రీ షాప్ నుంచి తెచ్చుకున్న మద్యం తాగి విమానంలోనే సంబరాలు చేసుకున్నారని.. మద్యం మత్తులో.. కిక్ ఎక్కువై.. తోటి ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వివరించారు అధికారులు.

విమానాల్లో ఇటీవల జరుగుతున్న వరస ఘటనలపై భద్రతా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మొన్నటికి మొన్న విమానంలోని టాయిలెట్ లో  సిగరెట్ తాగి.. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయటానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ప్రయాణికులు సహనం కోల్పోతున్నారని.. కోపంతో దాడులు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.