కేటీఆర్ మంత్రి అయ్యాక 2 లక్షల ఉద్యోగాలొచ్చాయ్

కేటీఆర్ మంత్రి అయ్యాక 2 లక్షల ఉద్యోగాలొచ్చాయ్

హైదరాబాద్ : కేటీఆర్ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చాయని.. వాటిలో దాదాపు  2 లక్షల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గురువారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై డైరీని ఆవిష్కరించారు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్.. ఎక్కువ మంది పని చేసేది ప్రయివేట్ సంస్థల్లోనే అన్నారు.  ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయని.. చదివిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదన్నారు.

ప్రైవేట్ సేక్టర్ లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. కొత్త రాష్ట్రంలో కేటీఆర్ మంత్రి అయ్యాక హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. వాటి ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. 2020 విజన్ తో మనం ముందుకు వెళ్ళాలన్న ఆయన.. కోటి ఎకరాల సాగు మరి కొద్ది రోజుల్లో జరుగుతుందన్నారు. మన పని చేసుకుంటే పోతే మనకు అన్ని వస్తాయని చెప్పుకొచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.