2 రెట్లు పెరిగిన సైబర్ ​దాడులు

2 రెట్లు పెరిగిన సైబర్ ​దాడులు

న్యూఢిల్లీ: మనదేశంలో రాన్సమ్​వేర్​, ఐఓటీ సైబర్ ​దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వీటి సంఖ్య రెండు రెట్లు పెరిగిందని సోనిక్​వాల్​ తయారు చేసిన రిపోర్ట్​  వెల్లడించింది. అమెరికా, యూకేలో దాడులు తగ్గగా, ఇండియాలో 133 శాతం, జర్మనీలో 52 శాతం పెరిగాయి. క్రిప్టోజాకింగ్​, ఐఓటీ మాల్వేర్​, ఎన్​క్రిప్టెడ్​​ థ్రెట్స్​ కూడా పెరిగాయి. గ్లోబల్​గా మాత్రం రాన్సమ్​వేర్​ దాడులు 41 శాతం తగ్గాయి. సైబర్​ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతులతో, టెక్నాలజీతో దాడులు చేస్తుండటంతో కంపెనీలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఇండియాలో రాన్సమ్​వేర్​, ఐఓటీ దాడులు పెరిగినా, క్రిప్టో దాడుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది.

సైబర్​దాడులు పెరగడం వల్ల ఇండియా ఎకానమీకి కూడా ప్రమాదమని, మాన్యుఫాక్చరింగ్ ​మొదలుకొని ఫార్మా వరకు... చాలా ఇండస్ట్రీలు ఇబ్బందిపడుతున్నాయని  సోనిక్​వాల్​ సీనియర్ ​ఎగ్జిక్యూటివ్​ దేవాశిష్​ ముఖర్జీ అన్నారు. ​స్కూళ్లను, గవర్నమెంట్​ఆఫీసులను, రిటైల్​ ఆర్గనైజేషన్లను సైబర్ ​క్రిమినల్స్ ఇబ్బంది పెడుతున్నారని ఈ రిపోర్టు తెలిపింది. దీంతో వీటికి సిస్టమ్​డౌన్​టైమ్​, ఆర్థిక నష్టాలు, ప్రతిష్ట దెబ్బతినడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఎడ్యుకేషన్​సెక్టార్​పై దాడులు 320 రెట్లు, గవర్నమెంట్​సంస్థలపై దాడులు 89 రెట్లు పెరిగాయి.