ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 20 మంది మృతి

ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 20 మంది మృతి

ఉగండాలోని ఘోర ప్రమాదం జరిగింది. రుబురిజి ప్రాంతంలో ఇవాళ( సోమవారం) తెల్లవారుజామున ఆయిల్ ట్యాంకర్ పేలి20 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ కెన్యా నుంచి రిపబ్లిక్ కాంగో వెళ్తుండగా మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో రోడ్డుకు పక్కనే ఉన్న వందలాది షాపులు కాలిపోయాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాలను రిబురిజి ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ చివరి వరకు ప్రయత్నించినప్పటికి ఈ ప్రమాదాన్ని ఆపలేకపోయారని స్థానికులు తెలిపారు. ఎదురుగా వచ్చిన వాహనం తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.